9 సిటీల్లో వన్‌ప్లస్ 6టి పాపప్ ఈవెంట్లు..!


Wed,October 24, 2018 01:20 PM

మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టిని ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. ఆ రోజున న్యూయార్క్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. అదే సమయానికి ఢిల్లీలోనూ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. అయితే వన్‌ప్లస్ 6టి విడుదలయ్యాక నవంబర్ 2వ తేదీన ఆ ఫోన్‌కు చెందిన పాపప్ ఈవెంట్లను వన్‌ప్లస్ నిర్వహించనుంది. మొత్తం 9 సిటీల్లో ఈ ఈవెంట్లు జరగనున్నాయి.

బెంగళూరు, ముంబై, పూణె, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్‌లలో వన్‌ప్లస్ 6టి పాపప్ ఈవెంట్లు జరగనున్నాయి. వాటిల్లో యూజర్లు పాల్గొని వన్‌ప్లస్ 6టి ఫోన్లను ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అలాగే ఆ ఫోన్ కావాలనుకునే వారు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో పాపప్ ఈవెంట్లలో పాల్గొనే యూజర్లకు వన్ ప్లస్ ప్రత్యేకమైన బహుమతులను అందివ్వనుంది. నవంబర్ 2వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయా నగరాల్లో ఏక కాలంలో పాపప్ ఈవెంట్లను నిర్వహిస్తారు. వాటిలో వన్ ప్లస్ స్కెచ్‌బుక్, ఫోన్ కవర్లు, టీషర్టులు, బ్యాగులను కూడా యూజర్లు పొందవచ్చు.

983

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles