న్యూ ఇయర్ ఆఫ‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌కే వ‌న్‌ప్ల‌స్ 6టి స్మార్ట్‌ఫోన్‌...


Sat,December 29, 2018 01:18 PM

నూత‌న సంవత్స‌రం సంద‌ర్భంగా మొబైల్స్ తయారీదారు వ‌న్‌ప్ల‌స్ క‌స్ట‌మ‌ర్ల‌కు డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను నేటి నుంచి అందిస్తున్న‌ది. అందులో భాగంగా ఈ మ‌ధ్యే విడుద‌లైన వ‌న్ ప్ల‌స్ 6టీ ఫోన్‌పై వినియోగ‌దారుల‌కు వన్‌ప్ల‌స్ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఈఎంఐ ట్రాన్సాక్ష‌న్స్‌పై కూడా ఈ ఆఫ‌ర్‌ను ఇస్తారు. వ‌న్ ప్ల‌స్ 6టి ఫోన్‌ను 6 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.2వేలు అద‌నంగా ఇస్తున్నారు. కాగా ఈ ఆఫ‌ర్ జ‌న‌వ‌రి 6వ తేదీ వ‌ర‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంద‌ని వ‌న్‌ప్ల‌స్ తెలియ‌జేసింది. వ‌న్ ప్ల‌స్ 6టి ఫోన్‌లో 6.41 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, 10 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

7114

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles