భారత్‌లో వన్‌ప్లస్ 6టి ధర ఎంతో తెలుసా..?


Wed,October 31, 2018 09:31 AM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టిని గత రెండు రోజుల కిందట విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్‌ను నిన్న భారత మార్కెట్‌లో లాంచ్ చేశారు. ఈ క్రమంలో వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 ధరకు లభ్యం కానుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది. రేపటి నుంచి ఈ ఫోన్లను అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్స్‌లోనూ వన్‌ప్లస్ 6టి ఫోన్లను విక్రయించనున్నారు.

వన్ ప్లస్ 6టి ఫోన్ లాంచింగ్ సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ ఫోన్‌ను కొన్న వారికి నో కాస్ట్ ఈఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది. అమెజాన్ పే ద్వారా కొంటే రూ.1వేయి క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.5400 విలువగల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను 36 వోచర్ల రూపంలో జియో అందిస్తున్నది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే రూ.2వేల విలువైన యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు.

వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో 6.41 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

3543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles