వచ్చేస్తుంది.. వన్‌ప్లస్ 6టి.. ఈనెల 30న విడుదల..!


Mon,October 8, 2018 07:43 PM

మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టి ని ఈ నెల 30వ తేదీన విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 8.30 గంటలకు న్యూయార్క్‌లో గ్లోబల్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ నిర్వహిచనుంది. అయితే అదే సమయానికి ఢిల్లీలోనూ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వన్‌ప్లస్ ఈవెంట్ జరుగుతుంది.

కాగా వన్‌ప్లస్ నిర్వహిస్తున్న ఢిల్లీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి టిక్కెట్లను విక్రయించనున్నారు. వన్‌ప్లస్.ఇన్ వెబ్‌సైట్‌లో రూ.999 కు ఈవెంట్ ఎంట్రీ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఈవెంట్‌కు వచ్చేవారు అక్కడి ఎక్స్‌పీరియెన్స్ జోన్‌లో వన్‌ప్లస్ 6టి ని ముందుగా ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అంతేకాకుండా ఈవెంట్‌లో పాల్గొనేవారికి వన్‌ప్లస్ ఓ గిఫ్ట్ హ్యాంపర్‌తోపాటు బుల్లెట్స్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వనుంది.

ఇక వన్‌ప్లస్ 6టి లో ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే 3.5 ఎంఎం జాక్‌ను పూర్తిగా తీసేశారట. ఇక ఈ ఫోన్‌లో 3700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అమర్చారట. ఈ ఫోన్ డిస్‌ప్లే 6.4 ఇంచ్ ఉంటుందని సమాచారం. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 9.0 పై తదితర ఇతర ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది. అయితే ఈవెంట్‌కు హాజరు కాని వారు లైవ్ స్ట్రీమ్‌ను ఇంటర్నెట్‌లో వీక్షించవచ్చు. ఇక ఎప్పటిలాగే వన్ ప్లస్ 6టి ఫోన్ కూడా ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో యూజర్లకు లభ్యం కానుంది.

2564

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles