వ‌న్‌ప్ల‌స్ బుల్లెట్స్ వైర్‌లెస్ 2 ఇయ‌ర్‌ఫోన్స్ విడుద‌ల


Wed,May 15, 2019 02:10 PM

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ కంపెనీ బుల్లెట్స్ వైర్‌లెస్ 2 పేరిట నూత‌న ఇయ‌ర్‌ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. రూ.5,990 ధ‌ర‌కు ఈ ఇయ‌ర్‌ఫోన్లు వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానున్నాయి. వ‌న్‌ప్ల‌స్ 7 సిరీస్ ఫోన్ల లాంచింగ్‌లోనే ఈ ఇయ‌ర్‌ఫోన్స్‌ను వ‌న్‌ప్ల‌స్ విడుద‌ల చేసింది. వీటిల్లో 10ఎంఎం డైన‌మిక్ డ్రైవ‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల సౌండ్ అవుట్‌పుట్ నాణ్యంగా ఉంటుంది. అలాగే ఈ ఇయ‌ర్‌ఫోన్స్‌ను కేవ‌లం 10 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే చాలు 10 గంట‌ల వ‌ర‌కు వీటిని నాన్‌స్టాప్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు.

1417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles