అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన వన్‌ప్లస్ 5టి స్మార్ట్‌ఫోన్


Sat,November 18, 2017 12:52 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'వన్‌ప్లస్ 5టి'ని తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే బెజెల్ లెస్‌గా ఉండడంతోపాటు 18:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. దీంతో ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు.

వన్ ప్లస్ 5టి స్మార్ట్‌ఫోన్‌లో బెజెల్ లెస్ డిస్‌ప్లే ఇచ్చినందున ముందు భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను తొలగించి వెనుక భాగంలో దాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్ సహాయంతో కేవలం 0.2 సెకండ్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ సెన్సార్‌ను కెమెరా షటర్ బటన్‌గా కూడా వాడవచ్చు. ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇవి చాలా నాణ్యమైన ఫొటోలను, వీడియోలను అందిస్తాయి. ముందు భాగంలో ఇచ్చిన కెమెరాతో యూజర్లు తమ ఫేస్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు. దీంతో 0.2 సెకండ్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.
OnePlus-5T
ఇక ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ ఓఎస్‌ను అందిస్తున్నారు. దీన్ని ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫోన్‌ను పూర్తిగా అల్యూమినియంతో తయారు చేశారు. దీంతో డివైస్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. ఫోన్‌లో ఉన్న బ్యాటరీ హెవీ యూసేజ్‌లోనూ 2 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది. అంతేకాదు ఈ ఫోన్‌ను కేవలం 30 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే వచ్చే బ్యాటరీ బ్యాకప్‌తో రోజు మొత్తం ఫోన్‌ను వాడుకోవచ్చు. వన్‌ప్లస్ 5టి స్మార్ట్‌ఫోన్ 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్ వరుసగా రూ.32,999, రూ.37,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల 28వ తేదీ నుంచి లభ్యం కానుంది. అమెజాన్ సైట్‌తోపాటు వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే అమెజాన్ సంస్థ తన ప్రైమ్ యూజర్ల కోసం ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. అందులో వన్‌ప్లస్ 5టి ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
OnePlus-5T

వన్‌ప్లస్ 5టి ఫీచర్లు...


6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2106 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8 ఓరియో), డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డిరాక్ హెచ్‌డీ సౌండ్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్.

7281

More News

VIRAL NEWS