జియో మినహా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ అన్నీ ఫెయిల్!


Fri,November 16, 2018 04:03 PM

న్యూఢిల్లీ: దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అడుగుపెట్టిన రిలయన్స్ జియో ఆదిశగా అడుగులు వేస్తోంది. ఒక్క రిలయన్స్ జియో మినహా అన్ని టెలికాం ఆపరేటర్లు కాల్‌కి అంతరాయం (కాల్ డ్రాప్) టెస్టు కోసం నిర్వహించిన డ్రైవ్‌టెస్టులో ఫెయిల్ అయ్యాయి. దేశంలోని వివిధ జాతీయ రహదారులు, పలు రైల్వే మార్గాల్లో టెలికాం రెగ్యులేటరీ.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నిర్దేశించిన లక్ష్యాలను డ్రైవ్ టెస్టులో పాస్ కాలేకపోయాయి. 8 హైవేలు, 3 రైల్వే రూట్లలో ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్టులు చేసినట్లు ట్రాయ్ పేర్కొంది.

నాలుగు హైవేలు, మూడు రైల్వే రూట్లలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఆపరేటర్లు 2జీ లేదా 3జీ నెట్‌వర్క్ అందించడంలో కాల్‌డ్రాప్ బెంచ్‌మార్క్‌ను చేరుకోలేకపోయాయి. అదే సమయంలో రహదారి, రైల్వే మార్గాల్లో కాల్‌డ్రాప్ ప్రమాణాలను చేరుకులేకపోయిన ఆపరేటర్ల జాబితాలో జియో పేరు కనిపించలేదు. అలహాబాద్ టు గోరఖ్‌పూర్, ఢిల్లీ టు ముంబయి, జబల్‌పూర్ టు సింగ్రౌలీ రైల్వే మార్గాల్లో కాల్ డ్రాప్ పరీక్షను నిర్వహించారు. వినియోగదారులకు మంచి డేటా వేగాన్ని, నెట్‌వర్క్ అందిస్తున్న జియో రోజు రోజుకూ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. నెట్‌వర్క్ లోపాల కార‌ణంగా కాల్‌కి అంతరాయం కలిగిన పక్షంలో.. కాల్ చేసిన కస్టమరుకు సదరు టెల్కో పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గ‌తంలోనే ఆదేశించిన సంగతి తెలిసిందే.

6337

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles