జడ్‌టీఈ నుంచి నూబియా జడ్18 స్మార్ట్‌ఫోన్


Tue,May 8, 2018 07:32 PM

జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'నూబియా జడ్18'ను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో 5.99 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌లను ఇందులో అమర్చారు. వెనుక భాగంలో 24, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు.

నూబియా జడ్18 ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2009

More News

VIRAL NEWS