జడ్‌టీఈ నుంచి నూబియా జడ్18 స్మార్ట్‌ఫోన్


Sun,April 22, 2018 06:23 PM

మొబైల్స్ తయారీదారు జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ నూబియా జడ్18 ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో 5.99 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అమర్చారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

నూబియా జడ్18 ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 24 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ.

2587

More News

VIRAL NEWS