రూ.9,900 చెల్లించి గెలాక్సీ ఎస్9 లేదా ఎస్9 ప్లస్‌ను పొందండి..!


Sat,March 17, 2018 12:50 PM

శాంసంగ్ సంస్థ గత నెలలో విడుదల చేసిన తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లు ఈ మధ్యే భారత మార్కెట్‌లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ ఫోన్లను దేశంలోని అన్ని ప్రధాన రీటెయిట్ సెల్లర్స్ విక్రయిస్తుండగా, పలు ఆన్‌లైన్ సైట్లలోనూ ఈ రెండు ఫోన్లకు గాను అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే ఎయిర్‌టెల్ సంస్థ తన కస్టమర్లకు రూ.9,900 డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు దాంతో గెలాక్సీ ఎస్9 లేదా ఎస్9 ప్లస్ ఫోన్‌ను పొందే అవకాశాన్ని కల్పిస్తున్నది.

ఎయిర్‌టెల్ తన ఆన్‌లైన్ స్టోర్ వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లను విక్రయిసున్నది. అయితే వీటిని కొనాలంటే వినియోగదారులు మొత్తం రుసుం చెల్లించాల్సిన పనిలేదు. కేవలం రూ.9,900 డౌన్‌పేమెంట్ చెల్లిస్తే చాలు, ఫోన్ ఇంటికి డెలివరీ అవుతుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2499 చొప్పున చెల్లించాలి. గెలాక్సీ ఎస్9 ప్లస్ అయితే నెలకు రూ.2799 చెల్లించాలి. మొత్తం 24 నెలల పాటు నెల నెలా ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఈఎంఐలోనే ఎయిర్‌టెల్ ప్లాన్ కలిసిపోయి ఉంటుంది. దాంతో వినియోగదారులకు నెలకు 80 జీబీ ఉచిత మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత ఎయిర్‌టెల్ హ్యాండ్‌సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్, 1 ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లకు చెందిన 64జీబీ వేరియెంట్లకు రూ.9,900 డౌన్ పేమెంట్ చెల్లించాలి. అదే 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లకు అయితే రూ.17,900 డౌన్‌పేమెంట్ కట్టాలి. ఇక ఈఎంఐ అయితే ఎస్9కు రూ.2499, ఎస్9 ప్లస్‌కు రూ.2799 చెల్లించాలి.

మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9 64 జీబీ రూ.57,900 ధ‌ర‌కు ల‌భ్య‌మ‌వుతుండ‌గా 256 జీబీ వేరియెంట్ రూ.65,900 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. అలాగే గెలాక్సీ ఎస్‌9 ప్ల‌స్ 64 జీబీ రూ.64,900 ధ‌రకు, 256 జీబీ రూ.72,900 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి.

2569

More News

VIRAL NEWS

Featured Articles