ఇక‌పై యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా వీడియోలు చూడొచ్చు.. ఎలాగంటే..?


Wed,March 13, 2019 12:31 PM

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ ఇప్పుడు త‌న సైట్‌లో యాడ్స్ రాకుండా వీడియోల‌ను చూసే వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ది. అయితే అలా వీడియోల‌ను చూడాలంటే.. యూట్యూబ్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను పొందాలి. ఈ క్ర‌మంలో భార‌త్‌లో ఇవాళ్టి నుంచే యూట్యూబ్ ప్రీమియం సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నెల‌కు రూ.129 చెల్లించి యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌ను తీసుకుంటే చాలు.. ఇక‌పై యూట్యూబ్ లో యూజ‌ర్లు చూసే ఏ వీడియోలోనూ యాడ్స్ రావు. అలాగే యూట్యూబ్‌లో యూట్యూబ్ ఒరిజిన‌ల్స్ పేరిట అందుబాటులో ఉన్న ఎక్స్‌క్లూజివ్ వీడియోల‌ను కూడా యూజ‌ర్లు వీక్షించ‌వ‌చ్చు. ఇక శాంసంగ్ ఈమ‌ధ్యే విడుదల చేసిన గెలాక్సీ ఎస్‌10 ఫోన్‌ను కొనుగొలు చేసిన యూజ‌ర్ల‌కు 4 నెల‌ల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సేవ‌లు ల‌భిస్తాయి. ఆ త‌రువాత నెల‌కు రూ.129 చెల్లించాల్సి ఉంటుంది.

1017

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles