యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్ బంపర్ ఆఫర్..!


Wed,November 22, 2017 04:34 PM

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే డీల్స్‌లో భాగంగా పలు పెయిడ్ గేమ్స్, యాప్స్‌ను చాలా తక్కువ ధరలకే యూజర్లకు అందిస్తున్నది. ఇందులో భాగంగా గూగుల్ ప్లే మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ నాలుగు నెలల పాటు ఉచితంగా లభిస్తున్నది. అదేవిధంగా అనేక రకాల ప్రీమియం గేమ్స్‌పై యూజర్లకు 80 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. కాల్ ఆఫ్ డ్యూటీ: బ్లాక్ ఓపీఎస్ జాంబీస్, జామెట్రీ వార్స్ 3: డైమెన్షన్స్, లేటన్స్ మిస్టరీ జర్నీ, లెగో జురాసిక్ వరల్డ్, మినీ మెట్రో, షాడో ఫైట్ 2 స్పెషల్ ఎడిషన్ తదితర అనేక రకాల గేమ్స్‌ను ఇప్పుడు యూజర్లు చాలా తక్కువ ధరలకే గూగుల్ ప్లే స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. పలు సినిమాలు, టీవీ షోలు, బుక్స్‌పై కూడా ప్లే స్టోర్‌లో రాయితీలు లభిస్తున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని గూగుల్ వెల్లడించింది.

3238

More News

VIRAL NEWS