రూ.129కే అమెజాన్ ప్రైమ్ నెలవారీ మెంబర్‌షిప్..!


Sat,June 23, 2018 03:56 PM

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తున్నది. రూ.129కే అమెజాన్ ప్రైమ్‌లో నెలవారీ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నది. గత సంవత్సరం కిందట ప్రారంభ ఆఫర్ కింద అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కేవలం రూ.499కే అమెజాన్ అందించింది. ప్రస్తుతం ఈ మెంబర్‌షిప్ కావాలంటే ఏడాదికి రూ.999 చెల్లించాల్సి వస్తున్నది. అయితే ఒకేసారి రూ.999 చెల్లించడం కష్టమని భావించే వారి కోసం అమెజాన్ నెలవారీ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో కేవలం రూ.129 చెల్లిస్తే చాలు, నెల రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌గా కొనసాగవచ్చు. ఇక క్రెడిట్ కార్డులు ఉన్నవారైతే కార్డును అమెజాన్ ప్రైమ్ అకౌంట్‌లో యాడ్ చేస్తే నెల నెలా డబ్బులు వాటంతట అవే ఆటో క్రెడిట్ అవుతాయి. ఇలా కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌గా కొనసాగవచ్చు.

అమెజాన్ సంస్థ అందిస్తున్న ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందితే ఆ వెబ్‌సైట్‌లో ఉండే ఎన్నో వస్తువులకు డెలివరీ ఉచితంగా లభిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉచితంగా సినిమాలు, వీడియోలు వీక్షించవచ్చు. కాగా ఏడాది సభ్యత్వంతో పోలిస్తే నెలవారీ సభ్యత్వం తీసుకున్న వారు ఏడాదికి రూ.549 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

3527

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles