'ఐసీఐసీఐ బ్యాంక్' వెబ్‌సైట్లో రైల్ టిక్కెట్ల బుకింగ్‌..!


Thu,December 24, 2015 01:26 PM

ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం 'ఐసీఐసీఐ బ్యాంక్' వెబ్‌సైట్ ద్వారా వినియోగ‌దారులు ఇప్పుడు రైల్ టిక్కెట్‌ల‌ను సైతం కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ఆ బ్యాంక్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ప్రీపెయిడ్ డిజిటల్ వాలెట్ ద్వారా రైల్వే ఈ-టికెట్‌ల‌ను యూజ‌ర్లు బుక్ చేసుకోవచ్చునని బ్యాంక్ వెల్లడించింది.

అయితే వినియోగదారులు తొలుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేవలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులతోపాటు ఇతర బ్యాంక్ కస్టమర్లు కూడా వినియోగించుకోవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరుపవచ్చు. రైళ్ల పూర్తి సమాచారంతోపాటు ఈ-టిక్కెట్ బుకింగ్ లేదా రద్దు చేసుకోవచ్చు. తమ వెబ్‌సైట్ ద్వారా పీఎన్‌ఆర్ స్టేటస్‌ను సైతం తెలుసుకునే వీలుంటుందని బ్యాంక్ తెలిపింది.

11674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles