భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్


Thu,October 11, 2018 01:41 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌ను గత కొద్ది నెలల కిందట మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను నేడు భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్‌లో 2.4 ఇంచుల క్యూవీజీఏ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అమర్చారు. ఈ ఫోన్‌లో ఉన్న స్లయిడర్‌ను కిందకి, పైకి జరపడం ద్వారా ఫోన్ కాల్స్‌ను ఆన్సర్ చేయవచ్చు, కట్ చేయవచ్చు. అలాగే ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ-మెయిల్స్ చదువుకోవచ్చు. జీమెయిల్, ఔట్‌లుక్ కాంటాక్ట్స్‌ను, క్యాలెండర్‌ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో మరిన్ని హంగులతో స్నేక్ గేమ్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్ సపోర్ట్ ఇందులో ఉంది. 2000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు.

నోకియా 8110 4జీ ఫీచర్లు...


2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ క్వాల్‌కామ్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ స్లాట్, డ్యుయల్ సిమ్, కైఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఫ్లాష్, ఐపీ52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోల్‌టీఈ, వైఫై, వైఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, జీపీఎస్, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 8110 4జీ ఫోన్ బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో రూ.5499 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన జియో కస్టమర్లకు జియో 500 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందివ్వనుంది.

2911

More News

VIRAL NEWS