నోకియా 8.1 ధర భారీగా తగ్గింది..!


Sun,June 9, 2019 05:09 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ను 2018 డిసెంబర్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు చెందిన 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లు రెండింటి ధరలను రూ.7వేల మేర తగ్గించారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999 ఉండగా, ఇప్పుడిది రూ.19,999 ధరకు లభిస్తున్నది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.29,999 ఉండగా ఇప్పుడీ వేరియెంట్ రూ.22,999 ధరకు లభిస్తున్నది. ప్రస్తుతం తగ్గించిన ధరలకే ఈ రెండు వేరియెంట్లను విక్రయిస్తున్నారు.

కాగా నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌లో 6.18 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను అందిస్తున్నారు.

6415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles