ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్


Wed,December 12, 2018 02:53 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 13 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బ్లూ/సిల్వర్, స్టీల్/ఐరన్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.26,999 ధరకు వినియోగదారులకు ఈ నెల 21వ తేదీ నుంచి లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్‌కు గాను నోకియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ సైట్‌లలో ఇప్పటికే ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఇక లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను ఈ ఫోన్‌పై అందిస్తున్నారు. ఎయిర్‌టెల్ ఈ ఫోన్‌ను కొన్న తన కస్టమర్లకు 1 టీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తుండగా, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఫోన్‌ను కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఇక సర్విఫై నుంచి 6 నెలల వాలిడిటీ ఉన్న ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు.

నోకియా 8.1 ఫీచర్లు...


6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2003

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles