ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్


Thu,December 6, 2018 02:12 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1 ను తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 12, 13 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బ్లూ/సిల్వర్, స్టీల్/కాపర్, ఐరన్/స్టీల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా రూ.31,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 15వ తేదీ నుంచి లభ్యం కానుంది. భారత్‌లో ఈ ఫోన్‌ను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు.

నోకియా 8.1 ఫీచర్లు...


6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1105

More News

VIRAL NEWS