ఈ నెల 19న నోకియా 6 విక్రయాలు షురూ..!


Wed,January 11, 2017 05:20 PM

లాస్‌వెగాస్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017లో మొన్నా మధ్యే నోకియా తన నూతన ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని అంతా భావించారు. కానీ అప్పటి వరకు ఆగకుండా ఈ నెల 19ననే ఈ ఫోన్‌ను నోకియా మార్కెట్‌లోకి తేనుంది. తొలుత చైనాలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం అవుతాయి. అనంతరం కొద్ది రోజులకే అన్ని దేశాల్లోనూ నోకియా 6 ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. భారత్‌లో దీన్ని ఆ కంపెనీ రూ.16,740 ధరకు విక్రయించనుంది.

నోకియా 6 ఫీచర్లు...

 • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
 • 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
 • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్
 • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
 • ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
 • 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
 • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
 • డాల్బీ అట్మోస్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
 • యూఎస్‌బీ ఓటీజీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 • 4438
  data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

  More News

  VIRAL NEWS