భారత్‌లో విడుదలైన నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్


Sat,October 12, 2019 05:35 PM

మొబైల్స్ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 6.2ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో ముందు, వెనుక భాగాల్లో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డీ స్లాట్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. రూ.15,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో లభిస్తున్నది.

నోకియా 6.2 ఫీచర్లు...


6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 10), 16, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

1401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles