నోకియా 3.2, 4.2 ఫోన్ల ధరలు తగ్గింపు..


Mon,June 17, 2019 05:39 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 3.2, 4.2 స్మార్ట్‌ఫోన్లను ఇటీవలే భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ల ధరలను ఆ కంపెనీ రూ.500 మేర తగ్గించింది. దీంతో నోకియా 3.2కు చెందిన 2జీబీ ర్యామ 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను ప్రస్తుతం వినియోగదారులు రూ.8490 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఇప్పుడు రూ.10,290 కి లభిస్తున్నది. ఇక నోకియా 4.2 స్మార్ట్‌ఫోన్ రూ.500 ధర తగ్గింపుతో ప్రస్తుతం రూ.10,490 కి లభిస్తున్నది. కాగా ఈ రెండు ఫోన్లను ఇప్పుడు తగ్గింపు ధరలకే విక్రయిస్తున్నారు.

3613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles