నోకియా 3.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,October 11, 2018 01:10 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 3.1 ప్లస్‌ను గత కొంత సేపటి క్రితమే విడుదల చేసింది. ఇందులో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ వన్ తదితర ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.11,499 ఉండగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. కాగా ఈ నెల 19వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. బ్లూ, వైట్, బాల్టిక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

నోకియా 3.1 ప్లస్ ఫీచర్లు...
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

1883

More News

VIRAL NEWS

Featured Articles