రూ.1299 కే నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్


Thu,November 15, 2018 09:03 AM

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. 2013లో ఈ ఫోన్ విడుదల కాగా దానికి కొనసాగింపుగా ఇప్పుడీ మళ్లీ అదే ఫోన్‌కు మరిన్ని హంగులు చేర్చి విడుదల చేశారు. ఇందులో 1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌లో క్లాసిక్ స్నేక్ గేమ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 2వేల కాంటాక్ట్‌లను ఫీడ్ చేసుకోవచ్చు. 500 టెక్ట్స్ మెసేజ్‌లు పడతాయి. డార్క్ గ్రే కలర్ వేరియెంట్‌లో నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్ రూ.1299 ధరకు వచ్చే వారం నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది.

నోకియా 106 (2018) ఫీచర్లు...


1.8 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 160 x 128 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ 6261డి ప్రాసెసర్, 4 ఎంబీ ర్యామ్, ఎఫ్‌ఎం రేడియో, నేటివ్ గేమ్స్, ఫ్లాష్ లైట్, మైక్రో యూఎస్‌బీ కనెక్టర్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, 21 రోజుల స్టాండ్ బై టైం, 15.7 గంటల టాక్‌టైం ఫీచర్లు ఈ ఫోన్‌లో లభిస్తున్నాయి.

3797

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles