నాయిస్ కంపెనీ షాట్స్ ఎక్స్3 బేస్ పేరిట నూతన వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. 5 కలర్ వేరియెంట్లలో ఈ ఇయర్ బడ్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిల్లో బ్లూటూత్ 5.0 టెక్నాలజీని ఏర్పాటు చేశారు. బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చిన మొదటి హెడ్‌ఫోన్స్ ఇవే కావడం విశేషం. ఇక ఈ హెడ్‌ఫోన్స్ 30 మీటర్ల రేంజ్ వరకు పనిచేస్తాయి. అలాగే ఐపీఎక్స్4 స్వెట్ ప్రూఫ్ ఫీచర్‌ను వీటిల్లో అందిస్తున్నారు. అందువల్ల ఎక్కువ సేపు హెడ్‌ఫోన్స్‌ను పెట్టుకున్నా చెమట అంటదు. అలాగే యాంటీ డ్రాపవుట్ డిజైన్‌ను ఈ హెడ్‌ఫోన్స్ కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు ఈ హెడ్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో 1500 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ హెడ్‌ఫోన్స్ రూ.3,999 ధరకు వినియోగదారులకు ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తున్నాయి.