షాకింగ్.. ఇక ఇన్‌క‌మింగ్ కాల్స్‌కూ డ‌బ్బు చెల్లించాల్సిందే!


Fri,November 23, 2018 01:34 PM

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ కస్టమర్లకు ఇది ఒక రకంగా షాకింగ్ న్యూసే. లైఫ్‌టైమ్ ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్‌కు ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌లు స్వస్తి పలకనున్నాయి. ఇన్‌కమింగ్ కాల్స్ రావాలన్నా కూడా మీరు కనీస రీచార్జీ చేసుకోవాల్సిందే. అయితే మొదట్లో ఉన్నట్లు నిమిషానికి ఇంత అన్నట్లు చార్జ్ చేయకపోయినా.. నెలవారీ కనీస రీచార్జ్‌లు మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. రిలయెన్స్ జియో మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మిగతా నెట్‌వర్క్‌లు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఇక లైఫ్‌టైమ్ ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్ ఇవ్వకూడదని ఈ సంస్థలు నిర్ణయించాయి. ఎయిర్‌టెల్ ఇలా కనీస రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. రూ.35, రూ.65, రూ.95 ప్లాన్స్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ రీచార్జ్ చేసుకుంటే డేటా, టాక్‌టైమ్‌తోపాటు 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. ఇలాగే వొడాఫోన్-ఐడియా కూడా లైఫ్‌టైమ్ ఫ్రీ ప్లాన్స్‌ను తీసేసినట్లు ప్రకటించింది. కనీసం నెలకు రూ.30 వసూలు చేయాలని సంస్థ నిర్ణయించింది. రెండేళ్ల కిందట జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆర్‌కామ్, టాటాలాంటివి మూతపడ్డాయి. వొడాఫోన్, ఐడియా విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌టెల్ కూడా భారీగా నష్టాలు చవిచూసింది. ఆ నష్టాలను కనీసం ఇలాగైనా భర్తీ చేసుకోవడానికి ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

7708

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles