ఇకపై ఆన్‌లైన్లో భారీ డిస్కౌంట్లు ఉండవు..!


Fri,December 28, 2018 03:57 PM

ఇటీవ‌లి కాలంలో ఆఫ్‌లైన్‌లో క‌న్నా ఆన్‌లైన్‌లో వివిధ వస్తువులకు ఎక్కువ‌ డిస్కౌంట్లు ప్రకటిస్తుండడంతో నెటిజన్లు ఎక్కువ‌గా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. సాధార‌ణ రోజుల్లో క‌న్నా పండ‌గల స‌మ‌యంలో విక్ర‌యానికి ఉంచిన వ‌స్తువుల‌పై అనూహ్య డిస్కౌంట్లు పెట్ట‌డంతో వినియోగ‌దారులు ఎగ‌బ‌డుతున్నారు. ఒక్కో ఇ-కామ‌ర్స్ కంపెనీ ఒక్కో ధ‌ర‌కు అమ్ముతుంటాయి. ఒకే వ‌స్తువుపై ఇలా ధరల్లో తేడా ఉండటానికి పోటీనే ప్ర‌ధాన కారణం. ఇక‌పై ఇలాంటి భారీ ఆఫ‌ర్లు ఉండ‌వు.

కొత్త ఇ-కామ‌ర్స్ పాల‌సీ 2019 ఫిబ్ర‌వ‌రి నుంచి అమ‌ల్లోకి వ‌స్తే ఆన్‌లైన్ అమ్మకాలు క‌ష్ట‌త‌రంగా మార‌నున్నాయ‌ని భార‌త్‌లో అతిపెద్ద ఇ-కామ‌ర్స్ సంస్థ‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. నూత‌న‌ నిబంధ‌ల వ‌ల్ల‌ భారీ డిస్కౌంట్ల సంప్ర‌దాయానికి తెర‌ప‌డ‌నుంది. ఇ-కామ‌ర్స్ పాల‌సీ వ‌ల్ల స్థానిక వ్యాపారుల‌కు చాలా మేలుక‌ల‌గ‌నుంది.

నూత‌న నిబంధ‌న‌లు దీర్ఘ‌కాలిక ప్ర‌భావం చూప‌నున్న నేప‌థ్యంలో సంప్ర‌దింపుల ప్ర‌క్రియ ద్వారా ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల‌ని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఎలాంటి మార్పులైనా ప‌రిశ్ర‌మ అభివృద్ధికి దోప‌ద‌ప‌డేలా ఉండాల‌ని కోరింది. 2019 ఫిబ్ర‌వ‌రి 1 నుంచి కొత్త పాల‌సీ అమ‌ల్లోకి వ‌స్తే ఇ-కామ‌ర్స్ వ్యాపారానికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గులుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ భావిస్తున్నాయి. ఇ-కామ‌ర్స్ షాపింగ్ సైట్స్‌తో పాటు ఫుడ్‌డెలివ‌రీ చేసే జొమాటో, ఫుడ్‌పాండా, పేటీఎం, ఫ్రీఛార్జ్ లాంటి త‌దిత‌ర ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల‌కు ఇవే నిబంధ‌న‌లు వ‌ర్తించేలా కొత్త పాల‌సీ ఉండ‌నున్న‌ట్లు తెలిసింది.

ఏదైనా కంపెనీ తాను ఉత్ప‌త్తి చేసిన వ‌స్తువుల్లో 25శాతానికి పైగా ఉత్ప‌త్తుల‌ను ఒకే ఇ-కామ‌ర్స్ సంస్థ‌కు అమ్మ‌డానికి వీల్లేదు. ఇక‌పై క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు పొందాలంటే క‌ఠిన నిబంధ‌న‌లు ఉన్నాయి. క్యాష్‌ బ్యాక్ ఆఫర్ల విషయంలో పారదర్శకంగా, ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా వ్యవహరించాచాల్సి ఉంటుంది.

ఇక‌పై ఏదైనా వ‌స్తువును ఎక్స్‌క్లూజివ్‌(ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు)గా లాంచ్ చేయ‌డానికి వీల్లేదు. ఫ్లాష్‌సేల్స్ పేరుతో ప్రీబుకింగ్స్ పెడుతున్న విష‌యం తెలిసిందే. కొన్ని ఇ-కామ‌ర్స్ సంస్థ‌లు ప‌లు కంపెనీల‌తో ముంద‌స్తు ఒప్పందాలు చేసుకొని వాటి మాత్ర‌మే ఉత్ప‌త్తుల‌ను అమ్ముతున్నాయి. వినియోగ‌దారులు ఆ ఒక్క ఆన్‌లైన్ సంస్థ నుంచి మాత్ర‌మే వాటిని కొనాల్సి వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

3718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles