నేషనల్ డిజిటల్ లైబ్రరీతో ప్రయోజనం


Mon,July 16, 2018 08:09 AM

చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు... ప్రపంచం మీ చేతిలో ఇమిడి పోయినట్లే. మీకు దొరకని పు స్తకాలను సైతం మీకు అందుబాటులో ఉన్నట్లే...ఒక్కసారి ఆండ్రాయిడ్ స్క్రీన్‌పై స్వైప్ చేస్తే చాలు మీకు కావాల్సిన పుస్తకాలు, సమాచారం మీ ముందు ఆవిష్కృతమవుతాయి. ఆండ్రాయిడ్ సహాయంతో నేషనల్ డిజిటల్ లైబ్రరీ నుంచి లక్షల పుస్తకాలను ఉచితంగా చదువుకోవ చ్చు. మినిస్ట్రీ ఆఫ్ హ్యుమన్ రీసోర్సెస్, ఐఐటీ, ఖర్‌గపూర్ సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో వెబ్‌సైట్ రూపకల్పన చేశారు. ఆ వివరాలు ..

మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఐఐటీ, ఖరగ్‌పూర్ సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో వెబ్‌సైట్ కు రూపకల్పన చేశారు. ఈ వెబ్‌సైట్‌లో ప్రాథమిక స్థాయి (ఒక తరగతి) నుంచి పీజీ వరకు పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచారు. తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు 70 భాషల్లో పుస్తకాలను ఉంచారు. దాదాపు 2లక్షల మంది రచయితలు రాసిన మూడు లోల కథనాలు. 3లక్షల మం ది రచయితలకు సంబంధించిన ఏడు లక్షల పుస్తకాలు ఉన్నాయి. 262కు పైగా ఆడియో కథనాలు 18, 587 వీడి యో పాఠాలున్నాయి. బీటెక్ తరువాత గేట్ పరీక్షకు అవసరమయ్యే పుస్తకాలతో పాటు కంప్యూటర్, వ్యవసాయ, సమాచార, సాధారణ తత్వశా స్త్రం, మనస్తత్వశాస్త్రం, సం ఘసేవ తదితర రంగాలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి.

మహానుభావుల చరిత్ర పుస్తకాలు, ఒకటి నుం చి పీజీ, వృత్తి విద్యా కోర్సు విద్యార్థులను అవసరమైన పుస్తకాలు ఈ వెబ్‌సైట్‌లో కోకొల్లలుగా ఉన్నాయి.
పోటీ పరీక్షలకు నిరుద్యోగులు పుస్తకాలు కుస్తీ పడుతుంటారు. ఒక్కోసారి అవసరమైన పుస్తకాలు దొరక్క, స్థానికంగా గల గ్రంథాలయాల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. తెలిసిన వారి దగ్గర, స్నేహితుల దగ్గర, పాత పుస్తకాల షాపుల్లో చెప్పులు అరిగిపోయేలా తిరిగినా కావాల్సిన పుస్తకాలు దొరక్క సతమతమవుతుంటారు. ఇక ఆ బాధలన్నింటికీ నిశ్చితంగా చెక్ పెట్టవచ్చు. సాంకేతికత పెరగడం, సెల్‌ఫోన్‌లు, ఆండ్రాయిడ్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు, పోటీ పరీక్షలకు తయారయ్యేందుకు నూతన విప్లవం ఆవిర్భవించింది.

ఇప్పుడు మన నెట్టింట్లో ఉచితంగా పుస్తకాలు చదువుకునే రోజులు వచ్చాయి. సాం కేతికత పెరిగిన తరువాత సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వినియో గం బాగా పెరిగిపోయింది. నిరుద్యోగులకు, పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులకు అండగా ఉండేందుకు సాం కేతిక వ్యవస్థలో నూతన విప్లవం ఆవిర్భవించింది. అదే నేషనల్ డిజిటల్ లైబ్రరీ. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 72లక్షల పుస్తకాల నేషనల్ లైబ్రరీ పేరుతో ఇంటర్నెట్‌లో ఒక్క క్లిక్ చేస్తే మనముందు ప్రత్యక్షమవుతాయి. ఏ పుస్తకం కావాలంటే దాన్ని చదివేయచ్చు.

తీరిక ఉన్నప్పుడు చదువుకోవచ్చు..


గ్రంథాలయంలో నిర్ణీత సమయంలో మాత్రమే చదువుకునే వీలుంటుంది. మనకు తీరిక ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకునే సౌలభ్యం నేషనల్ డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌లోకి వెళ్లి <\<>http:// ndl. iitkgp.ac.in>>లోకి లాగిన్ అవ్వాలి. తరపై వచ్చిన అం శాలను నమోదు చేసుకుంటూ వెళ్లాలి. ఇక్కడ ఈ మెయిల్ సొంత చిరునామా నమోదు చేయాలి. ఒకసారి నమోదు చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అయి పుస్తకాలు చదువుకోవచ్చు. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు నేషనల్ డిజిటల్ లైబ్రరీ అప్లికేషన్ ద్వారా పుస్తకాలు చదువుకోవచ్చు. పుస్తకాలు కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్లో ఆంగ్లం, హిందీ బాషల్లో పుస్తకాలు లభిస్తాయి. ప్లే స్టోర్ నుంచి నేషనల్ డిజిటల్ లైబ్రరీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1546

More News

VIRAL NEWS

Featured Articles