మరోసారి జియో సునామీ.. ఉచితంగా 4కె టీవీ, సెట్‌టాప్ బాక్సులు..


Mon,August 12, 2019 12:09 PM

ముంబై: గత 3 ఏళ్ల కిందట రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలు దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు జియో డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలకు కూడా కోలుకోలేని షాక్ ఇవ్వనుంది. త్వరలో జియో ఈ రెండు సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ ఏజీఎంలో పాల్గొన్న ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ గత కొంత సేపటి క్రితమే జియో గిగాఫైబర్ వివరాలను వెల్లడించారు. జియో ఏర్పాటై 3 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల సెప్టెంబర్ 5వ తేదీన జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించనున్నామని తెలిపారు. ఇక ఈ సేవల్లో భాగంగా జియో 4కె డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్, ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఒకే ప్లాన్ కింద అందిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా జియో గిగాఫైబర్ నెలవారీ ప్లాన్లు రూ.700 నుంచి రూ.10వేల వరకు ఉంటాయని అన్నారు.

జియో గిగాఫైబర్ ద్వారా అందించనున్న ల్యాండ్‌లైన్‌లో కేవలం రూ.500కే అన్‌లిమిటెడ్ ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చని ముఖేష్ అంబానీ అన్నారు. ప్రస్తుతం ఫిక్స్‌డ్ ల్యాండ్‌లైన్ కాల్స్‌కు ఇతర కంపెనీలు వసూలు చేస్తున్న చార్జిల కన్నా జియో గిగాఫైబర్ ల్యాండ్‌లైన్ చార్జిలు తక్కువగా ఉంటాయని తెలిపారు. అలాగే అమెరికాలో ప్రస్తుతం సగటు వినియోగదారుడికి అందుతున్న బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 90 ఎంబీపీఎస్ ఉందని, కానీ జియో ద్వారా భారత్‌లోని కస్టమర్లకు 100 ఎంబీపీఎస్ కనీస స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభిస్తాయని తెలిపారు. ఇక ఈ స్పీడ్‌ను గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు పెంచుతామని ముఖేష్ అంబానీ అన్నారు.

జియో గిగాఫైబర్ వార్షిక ప్లాన్లను తీసుకునే వారికి ఉచితంగా 4కె హెచ్‌డీ టీవీలు, జియో 4కె సెట్‌టాప్ బాక్సులను అందిస్తామని ముఖేష్ అంబానీ వెల్లడించారు. జియో గిగాఫైబర్ సేవల్లో ఓటీటీ యాప్‌లను కూడా ఉచితంగా అందిస్తామన్నారు.

16119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles