కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన ఎంఎస్‌ఐ


Sat,July 21, 2018 07:07 PM

కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు ఎంఎస్‌ఐ తన నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లు జీఎఫ్63, పీఎస్42 లను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ7 8వ జనరేషన్ ప్రాసెసర్లను ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఐ జీఎఫ్63 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల డిస్‌ప్లే, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1050 టీఐ గ్రాఫిక్స్, 10 గంటల బ్యాటరీ బ్యాకప్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.79,990 గా ఉంది. అలాగే ఎంఎస్‌ఐ పీఎస్42 ల్యాప్‌టాప్‌ను రూ.77,990 ధరకు అందిస్తున్నారు.

2228

More News

VIRAL NEWS