మోటోరోలా వన్ విజన్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,June 20, 2019 04:58 PM

మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో వన్ విజన్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న ఇన్ స్క్రీన్ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో ఉన్న 3500 ఎంఏహెచ్ బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ రూ.19,999 ధరకు వినియోగదారులకు ఈ నెల 27వ తేదీ నుంచి లభ్యం కానుంది.

మోటోరోలా వన్ విజన్ ఫీచర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles