మోటోరోలా వన్ పవర్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అదుర్స్..!


Mon,September 24, 2018 05:34 PM

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్ పవర్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇందులో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. అలాగే ఇందులో ఉన్న ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్‌ను ఆండ్రాయిడ్ 9.0 పై కి అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అమర్చారు. 2 రోజుల వరకు ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ వస్తుంది.

మోటోరోలా వన్ పవర్ ఫీచర్లు...


6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డెడికేటెడ్ సిమ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, పీ2ఐ వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, డాల్బీ ఆడియో, డ్యుయల్ మైక్రో ఫోన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మోటోరోలా వన్ పవర్ స్మార్ట్‌ఫోన్ కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే లభిస్తున్నది. రూ.15,999 ధరకు దీన్ని ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్రయించనున్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. కాగా ఈ ఫోన్‌తోపాటు క్లియర్ ప్రొటెక్టివ్ కేస్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. అలాగే జియో వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.4450 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. అందుకు గాను వారు రూ.198 లేదా రూ.299 ప్లాన్లను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు రూ.2200 క్యాష్‌బ్యాక్‌ను జియో వోచర్ల రూపంలో అందిస్తుంది. క్లియర్‌ట్రిప్‌కు చెందిన రూ.1250 క్యాష్‌బ్యాక్ వోచర్లు కూడా లభిస్తాయి. మింత్రాకు చెందిన రూ.1000 విలువ గల డిస్కౌంట్ వోచర్లు లభిస్తాయి.

4311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles