మోటోరోలా వన్ పవర్ తరువాతి సేల్ ఎప్పుడంటే..?


Sat,October 6, 2018 06:49 PM

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్ పవర్‌ను ఈ మధ్యే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌కు గాను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్‌ను నిర్వహించారు. అయితే సేల్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ మెసేజ్ యూజర్లకు దర్శనమిస్తుంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు వినియోగదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభించిందని తెలుస్తున్నది. అయితే మొదటి సేల్‌లో మొత్తం ఎన్ని యూనిట్లను విక్రయించారో ఆ వివరాలను మాత్రం మోటోరోలా వెల్లడించలేదు. కానీ సేల్‌లో భాగంగా ఒక సెకన్‌కు 100 మోటో వన్ పవర్ ఫోన్లు అమ్ముడయ్యాయని మోటోరోలా ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఫోన్‌కు గాను ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు రెండో సేల్‌ను నిర్వహిస్తామని మోటోరోలా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగానే ఈ ఫోన్‌ను సేల్‌కు ఉంచినట్లు మోటోరోలా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆ సేల్‌లో మోటో వన్ పవర్ ఫోన్‌కు గాను మరింత స్టాక్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

కాగా మోటోరోలా మోటో వన్ పవర్ స్మార్ట్‌ఫోన్‌లో 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.

2639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles