ఆకట్టుకునే ఫీచర్లతో.. మోటోరోలా వన్ యాక్షన్ స్మార్ట్‌ఫోన్..


Sat,August 24, 2019 12:23 PM

మొబైల్స్ తయారీదారు మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ యాక్షన్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.13,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 30వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1వేయి వరకు డిస్కౌంట్‌ను అందిస్తారు. జియో వినియోగదారులకు రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్, 125 జీబీ వరకు అదనపు డేటా లభిస్తుంది.

మోటోరోలా వన్ యాక్షన్ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.3 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 16, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

1935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles