ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Mon,September 10, 2018 02:26 PM

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో జీ6 ప్లస్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.22,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో, మోటో హబ్ స్టోరస్‌లో లభిస్తున్నది. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. పేటీఎం మాల్ యాప్‌ను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కల్పించారు. జియో కస్టమర్లకు ఈ ఫోన్‌తో రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వోచర్లు లభిస్తాయి. అలాగే క్లియర్ ట్రిప్ నుంచి రూ.1250 విలువైన వోచర్లు వస్తాయి.

మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 5.93 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలున్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫ్లాష్ సదుపాయం కల్పించారు. ఈ ఫోన్ ముందు భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇందులో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.

మోటో జీ6 ప్లస్ ఫీచర్లు...


5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, పీ2ఐ వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, డాల్బీ ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

1926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles