మొబిస్టార్ ఎక్స్‌1 నాచ్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌


Sat,January 12, 2019 03:25 PM

మొబైల్స్ త‌యారీదారు మొబిస్టార్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మొబిస్టార్ ఎక్స్‌1 నాచ్‌ను తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 5.7 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచ‌ర్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ముందు, వెనుక భాగాల్లో 13 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న కెమెరాకు ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉండ‌గా, ఈ ఫోన్‌లో డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.8,499 ఉండ‌గా, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.9,499 గా ఉంది.

మొబిస్టార్ ఎక్స్1 నాచ్ ఫీచ‌ర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1498 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1691

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles