ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు మైక్రోసాఫ్ట్ కొత్త ఫొటో యాప్


Sun,February 18, 2018 05:43 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ 'ఫొటోస్ కంపానియన్' పేరిట ఓ నూతన ఫొటో యాప్‌ను తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ లభిస్తున్నది. ఆయా డివైస్‌లను వాడే యూజర్లు ఈ యాప్‌ను తమ తమ యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.1 ఆపైన వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌లతోపాటు, ఐఓఎస్ 10.2 ఆపైన వెర్షన్ ఉన్న ఐఫోన్లు, ఐప్యాడ్స్, ఐపాడ్ టచ్ డివైస్‌లలోనూ ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇందులో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ఫొటోస్ కంపానియన్ యాప్ సహాయంతో యూజర్లు తమ డివైస్‌లలో ఉండే ఫొటోలను సులభంగా విండోస్ 10 పీసీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకు రెండు డివైస్‌లలోనూ వైఫై ఉంటే చాలు. ఇక రెండు డివైస్‌లు ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉంటే కేవలం డివైస్‌లో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఫొటోలను ఒక డివైస్ నుంచి మరొక డివైస్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అదేవిధంగా యూజర్లు తమ ఫొటోలను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఈ యాప్‌లో అందిస్తున్నారు.

3105

More News

VIRAL NEWS