ఐఓఎస్ ఎడ్జ్ బ్రౌజర్‌కు 3డీ టచ్ సపోర్ట్


Sat,February 24, 2018 08:05 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఐఓఎస్ ఎడ్జ్ బ్రౌజర్ యాప్‌లో పలు కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో ప్రస్తుతం యూజర్లకు 3డీ టచ్ ఫీచర్ లభిస్తున్నది. ఎప్పటి నుంచో యూజర్లు దీని కోసం వేచి చూస్తుండగా ఇప్పుడీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక దీంతోపాటు ఈ యాప్‌లో పలు ఇతర ఫీచర్లు కూడా యూజర్లకు లభిస్తున్నాయి. అవేమిటంటే... బ్రౌజర్‌లో కొత్త ట్యాబ్ ఓపెన్ చేస్తే అందులో కనిపించే న్యూస్ ఫీడ్ పేజెస్‌ను నిర్దిష్టమైన ప్రదేశంలో సెట్ చేసుకోవచ్చు. దీంతోపాటు సదరు న్యూస్ ఫీడ్‌లో ఉండే వెబ్‌సైట్లలో కనిపించే కంటెంట్‌ను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా లింక్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే న్యూ ట్యాబ్‌లో అది ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఇతర యాప్స్ నుంచి ఎడ్జ్ బ్రౌజర్‌కు లింక్స్‌ను సులభంగా షేర్ చేసుకునే వీలు కల్పించారు. ఇక ఔట్‌లుక్ యాప్‌లో ఉండే లింక్స్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్లన్నింటినీ పొందాలంటే ఐఓఎస్ యూజర్లు తమ డివైస్‌లలో ఉన్న ఎడ్జ్ బ్రౌజర్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ ఎడ్జ్ బ్రౌజర్ యాప్ ప్రస్తుతం యూజర్లకు యాపిల్ యాప్ స్టోర్‌లో లభిస్తున్నది.

2106

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles