48 మెగాపిక్స‌ల్ కెమెరాతో వ‌స్తున్న మెయ్‌జు నోట్ 9


Sat,February 23, 2019 01:21 PM

మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు కు చెందిన నూత‌న స్మార్ట్ ఫోన్ మెయ్‌జు నోట్ 9 ను మార్చి 6వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న భారీ రిజ‌ల్యూష‌న్‌ కెమెరాను అమర్చారు. ముందు భాగంలోనూ 20 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేయ‌గా, ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

మెయ్‌జు నోట్ 9 స్మార్ట్‌ఫోన్ లో 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2244×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1339

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles