ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన మెయ్‌జు 16ఎక్స్ స్మార్ట్‌ఫోన్


Wed,September 19, 2018 07:56 PM

మొబైల్స్ తయారీదారు మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ 16ఎక్స్‌ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్‌కు చెందిన 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.22,285 ధరకు లభ్యం కానుండగా, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.25,470 ధరకు లభ్యం కానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఫోన్లకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

మెయ్‌జు 16ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఉన్న 3100 ఎంఏహెచ్ బ్యాటరీకి ఫ్లాష్ చార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు.

మెయ్‌జు 16ఎక్స్ ఫీచర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3212

More News

VIRAL NEWS