ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన మెయ్‌జు 16th స్మార్ట్‌ఫోన్


Wed,December 5, 2018 06:07 PM

మొబైల్స్ తయారీదారు మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 16th ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. దీంతో కేవలం 0.25 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో 12, 20 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని వెనుక భాగంలో ఏర్పాటు చేయగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.39,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

మెయ్‌జు 16th ఫీచర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1408

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles