ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కొత్త మ్యూజిక్ ప్లేయ‌ర్ యాప్‌...


Sun,May 1, 2016 07:31 PM

ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను వాడుతున్న యూజ‌ర్ల కోసం 'లిజ‌నిట్ స్ట‌న్నింగ్ మ్యూజిక్ ప్లేయ‌ర్' పేరిట ఓ నూత‌న మ్యూజిక్ ప్లేయ‌ర్ యాప్ తాజాగా అందుబాటులోకి వ‌చ్చింది. దీన్ని యూజ‌ర్లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 2.2 ఆపైన వెర్ష‌న్ ఉన్న డివైస్‌ల‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

'లిజ‌నిట్ స్ట‌న్నింగ్ మ్యూజిక్ ప్లేయ‌ర్' యాప్ ద్వారా యూజ‌ర్లు త‌మ డివైస్‌లోని సంగీతాన్ని సుల‌భంగా ఆస్వాదించ‌వచ్చు. అనేక ర‌కాల ఆడియో ఫైల్ ఫార్మాట్‌ల‌ను ఈ యాప్ స‌పోర్ట్ చేస్తుంది. ఎంపీ3, ఎంపీ4, మిడి, ఏఏసీ, ఫ్లాక్‌, ఓజీజీ వంటి ఫైల్స్‌ను ఇది సుల‌భంగా ప్లే చేయ గ‌లుగుతుంది. యూజ‌ర్లు త‌మకు ఇష్ట‌మైన పాట‌ల‌ను ప్లే లిస్ట్ రూపంలో సేవ్ చేసుకోవ‌చ్చు. దీంతో ఎప్పుడు కావాల‌న్నా ఆ ప్లే లిస్ట్‌ను ప్లే చేసుకుంటే చాలు, ఫేవ‌రెట్ పాట‌ల‌ను విన‌వ‌చ్చు. అంతేకాకుండా మ్యూజిక్‌కు సంబంధించిన ప‌లు ఫీచ‌ర్లు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

3704

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles