ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..!


Wed,March 13, 2019 03:54 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ అప్‌డేట్ పొంద‌నున్న త‌న స్మార్ట్‌ఫోన్ల వివ‌రాల‌ను ఇవాళ వెల్ల‌డించింది. ఈ జాబితాలో ఇచ్చిన ఫోన్ల‌కు త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ అప్‌డేట్ ల‌భిస్తుంద‌ని షియోమీ తెలిపింది. దీంతో కొత్త ఓఎస్‌లో యూజర్లు నూత‌న ఫీచ‌ర్లు పొంద‌వ‌చ్చు.

ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే...
షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ, నోట్ 5 ప్రొ, రెడ్‌మీ 6 ప్రొ, రెడ్‌మీ వై2, ఎంఐ 6ఎక్స్‌, ఎంఐ8, ఎంఐ8 ఎక్స్‌ప్లోర‌ర్ ఎడిష‌న్‌, ఎంఐ8 ప్రొ, ఎంఐ8 ఎస్ఈ, పోకో ఎఫ్‌1, ఎంఐ మిక్స్ 2ఎస్‌, ఎంఐ మ్యాక్స్ 3 ఫోన్ల‌కు త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్ అందివ్వ‌నున్నారు.

అలాగే రెడ్‌మీ 5ఎ, రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్ల‌స్‌, ఎంఐ 5ఎక్స్‌, ఎంఐ మిక్స్, ఎంఐ మిక్స్ 2, ఎంఐ 5, ఎంఐ 5ఎస్‌, ఎంఐ 5ఎస్ ప్ల‌స్‌, ఎంఐ 6, ఎంఐ నోట్ 2, ఎంఐ నోట్ 3 ఫోన్ల‌కు త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్ విడుద‌ల చేయ‌నున్నారు.

1432

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles