ఆండ్రాయిడ్ క్యూ అప్‌డేట్ పొందనున్న హువావే ఫోన్లు ఇవే..!


Sat,August 10, 2019 04:24 PM

గూగుల్ సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ క్యూ ను త్వరలో విడుదల చేయనున్న విషయం విదితమే. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్‌ను తమ తమ ఫోన్లలో వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక హువావే కూడా ఆండ్రాయిడ్ క్యూ ఓఎస్ పొందనున్న తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లకు త్వరలోనే ఆండ్రాయిడ్ క్యూ ఆధారిత ఈఎంయూఐ 10 ఓఎస్‌ను హువావే అందివ్వనుంది. మరి ఆ జాబితాలో ఉన్న హువావే ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!

హువావే పి30 ప్రొ, పి30, మేట్ 20, మేట్ 20 ప్రొ, పోర్షె డిజైన్ హువావే మేట్ 20 ఆర్‌ఎస్, మేట్ 10, మేట్ 20 లైట్, పి30 లైట్, పి స్మార్ట్ 2019, పి స్మార్ట్ ప్లస్ 2019, పి స్మార్ట్ జడ్, మేట్ 20 ఎక్స్, మేట్ 20ఎక్స్ 5జీ, పి20 ప్రొ, పి20, మేట్ 10 ప్రొ, పోర్షె డిజైన్ హువావే మేట్ 10, హానర్ 20 ప్రొ, హానర్ 20, హానర్ 20ఐ/20 లైట్, వ్యూ20/వీ20, హానర్ 10, 10 లైట్, హానర్ 8ఎక్స్ ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ క్యూ అప్‌డేట్‌ను అందివ్వనున్నారు.

1618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles