ఎల్‌జీ నుంచి వి40 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్


Thu,January 17, 2019 05:01 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వి40 థిన్‌క్యూను ఈ నెల 20వ తేదీన భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. అదే రోజు అమెజాన్‌లో ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు ఎక్స్‌క్లూజివ్‌గా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు ఈ నెల 19వ తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. కాగా ఈ ఫోన్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఎల్‌జీ వి40 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు భాగంలో 5, 8 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను ఇందులో అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

ఎల్‌జీ వి40 థిన్‌క్యూ ఫీచ‌ర్లు...
6.4 ఇంచ్ ఫుల్ విజ‌న్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 12, 16, 12 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 5, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ ఫ్రంట్ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఐపీ 68 వాటర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డీటీఎస్ ఎక్స్ 3డి స‌రౌండ్ సౌండ్‌, బూమ్ బాక్స్ స్పీక‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌.

1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles