ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్


Sun,January 20, 2019 04:28 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వీ40 థిన్‌క్యూను భార‌త మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 12, 12 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉన్నాయి. ముందు భాగంలో 5, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ఈ ఫోన్‌కు ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. వైర్‌లెస్ చార్జింగ్‌కు ఇందులో స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. న్యూ మొరాక‌న్ బ్లూ, న్యూ ప్లాటినం గ్రే క‌ల‌ర్ ఆప్షన్ల‌లో ఈ ఫోన్ రూ.49,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ప్ర‌త్యేకంగా అమెజాన్ సైట్‌లో ల‌భిస్తున్న‌ది. ఈ ఫోన్‌కు గాను రూ.16,750 విలువైన స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ను ఆఫ‌ర్ రూపంలో ఉచితంగా అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.5వేలు అద‌న‌పు డిస్కౌంట్ ల‌భిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు.

ఎల్‌జీ వీ40 థిన్‌క్యూ ఫీచ‌ర్లు...

6.4 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడ‌బుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 12, 16, 12 ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 5, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఐపీ 68 వాటర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డీటీఎస్ ఎక్స్ 3డి స‌రౌండ్ సౌండ్‌, బూమ్ బాక్స్ స్పీక‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌.

2519

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles