క్యూ9 వ‌న్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఎల్‌జీ


Tue,February 12, 2019 02:54 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ త‌న నూతన స్మార్ట్‌ఫోన్ క్యూ9 వ‌న్ ను ఇవాళ కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తుంది. ఈ ఫోన్‌కు ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఇందులో వెనుక భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. ఈ ఫోన్ రూ.37,940 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ఈ నెల 15వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

ఎల్‌జీ క్యూ9 వ‌న్ ఫీచ‌ర్లు...


6.1 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

1839

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles