అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఎల్‌జీ క్యూ స్టైల‌స్ ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్


Tue,September 4, 2018 03:49 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ క్యూ స్టైల‌స్ ప్ల‌స్ ను ఇవాళ విడుద‌ల చేసింది. రూ.21,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఎల్‌జీ క్యూ స్టైల‌స్ ప్ల‌స్ ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాల‌ను అమ‌ర్చారు. ఈ ఫోన్‌లో ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

ఎల్‌జీ క్యూ స్టైల‌స్ ప్ల‌స్ ఫీచ‌ర్లు...


6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డీటీఎస్ ఎక్స్‌3డి సరౌండ్ సౌండ్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

2364

More News

VIRAL NEWS