గ్రామ్ సిరీస్‌లో ఎల్‌జీ కొత్త ల్యాప్‌టాప్‌లు


Sun,August 25, 2019 02:21 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ భారత్‌లో గ్రామ్ సిరీస్‌లో పలు నూతన ల్యాప్‌టాప్‌లను తాజాగా విడుదల చేసింది. 14, 15.6, 17 ఇంచ్ డిస్‌ప్లే సైజుల్లో ఈ ల్యాప్‌టాప్‌లు వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తదితర అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. ఎల్‌జీ గ్రామ్ 14జడ్990-వి ల్యాప్‌టాప్‌లో 14 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్ ప్రింట్ రీడర్, 0.9 మెగాపిక్సల్ హెచ్‌డీ వెబ్ కెమెరా, 72 వాట్ అవర్ 4 సెల్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఎల్‌జీ గ్రామ్ 15జడ్990-వి ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్ ప్రింట్ రీడర్, 0.9 మెగాపిక్సల్ హెచ్‌డీ వెబ్ కెమెరా, 72 వాటర్ అవర్ 4 సెల్ బ్యాటరీని అందిస్తున్నారు. అలాగే ఎల్‌జీ గ్రామ్ 17జడ్990-వి ల్యాప్‌టాప్‌లో 17 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్ ప్రింట్ రీడర్, 0.9 మెగాపిక్సల్ హెచ్‌డీ వెబ్ కెమెరా, 72 వాట్ అవర్ 4 సెల్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఎల్‌జీ గ్రామ్ 14 ఇంచ్ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.95వేలు ఉండగా, 15.6 ఇంచ్ మోడల్ ప్రారంభ ధర రూ.98వేలుగా ఉంది. అలాగే 17 ఇంచుల మోడల్ ప్రారంభ ధర రూ.1.26 లక్షలుగా ఉంది. ఈ మూడు మోడల్ ల్యాప్‌టాప్‌లు అమెజాన్‌లో వచ్చే వారం నుంచి లభ్యం కానున్నాయి.

566
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles