ఎల్‌జీ నుంచి జీ7 ఫిట్ స్మార్ట్‌ఫోన్


Sun,November 11, 2018 04:12 PM

జీ7 ఫిట్ పేరిట ఎల్‌జీ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో 6.1 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను ఇందులో అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినందువల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఇందులో వెనుక భాగంలో 16, 8 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని అమర్చారు.

ఎల్‌జీ జీ7 ఫిట్ ఫీచర్లు...


6.1 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

2126

More News

VIRAL NEWS

Featured Articles