నూతన థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన లెనోవో


Sat,August 18, 2018 06:32 PM

కంప్యూటర్స్, మొబైల్స్ తయారీదారు లెనోవో తన నూతన థింక్‌ప్యాడ్ ల్యాప్‌టాప్‌లు పీ1, పీ72 లను తాజాగా విడుదల చేసింది. థింక్‌ప్యాడ్ పీ1 ల్యాప్‌టాప్ లెనోవోకు చెందిన అత్యంత సన్ననైన, తక్కువ బరువున్న ల్యాప్‌టాప్ కావడం విశేషం. కేవలం 1.7 కిలోల బరువును మాత్రమే ఈ ల్యాప్‌టాప్ కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 15 ఇంచుల 4కె అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ 8వ జనరేషన్ జియాన్, కోర్ ప్రాసెసర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎన్‌వీడియా క్వాడ్రో పీ1000, పీ2000 ప్రొఫెషనల్ గ్రాఫిక్ కార్డ్స్, 64జీబీ ర్యామ్, 4టీబీ హార్డ్ డిస్క్, విండోస్ 10 తదితర ఫీచర్లు ఉన్నాయి.

లెనోవో థింక్ ప్యాడ్ పీ72 ల్యాప్‌టాప్‌లో 17 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ 8వ జనరేషన్ జియాన్, కోర్ ప్రాసెసర్లు, ఎన్‌వీడియో పీ5200 క్వాడ్రో గ్రాఫిక్స్, 6టీబీ హార్డ్ డిస్క్, 128 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటెల్ ఆప్టేన్ మెమొరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. థింక్‌ప్యాడ్ పీ1 రూ.1,36,225 ప్రారంభ ధరకు లభిస్తుండగా, థింక్‌ప్యాడ్ పీ72 ల్యాప్‌టాప్ రూ.1,25,741 ధరకు లభిస్తున్నది.

2803

More News

VIRAL NEWS

Featured Articles